నా గురించి


నా గురించి చెప్పుకోవడానికి గొప్పగా ఏమి లేదు.
డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ 1982 లో విశాఖపట్నం వదలి ఉద్యోగరీత్యా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పోయాను.
హిందీ మాట్లాడే ప్రాంతాలలో నివశించడం వలన తరచూ తెలుగు పత్రికలు చూసే అవకాశం లేక పోయింది. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తాజా తెలుగు సమాచారం ఇట్టే తెలుసుకోగలుగుతున్నాము. అప్పట్లో ఆ అవకాశం లేదు. టెలిగ్రామ్ చేరడానికే ఒకటి లేదా  రెండు రోజులు పట్టేది. ఉద్యోగరీత్యా వున్న ఆంక్షల కారణంగా పత్రికలకూ, ప్రింట్ మీడియా కు కోరిక చంపుకుని దూరంగా ఉండి పోయాను.

ఇరవై ఏళ్ళ సర్వీస్ అనంతరం 2002 లో రిటైర్మెంట్ తరువాత కలర్ చిప్స్ ఇండియా , జూబ్లీ హీల్స్, హైదరాబాద్ లో సిండికేషన్ డిపార్ట్మెంట్ లో ఫీచర్ ఆర్టిస్ట్ గా చిత్రకారులు శ్రీ బాలి గారి దగ్గర శిష్యుడిగా చేరాను. బాలి గారు పెన్సిల్ తో rough sketch లు గీస్తుంటే దగ్గరగా ఉండి చూసే అరుదైన అవకాశం అలా వస్తుందని నేను ముందెన్నడూ ఊహించలేదు.

కలర్ చిప్స్ లో ఆర్టిస్ట్ గా అవకాశాన్ని కలిగించినది గురువుగారు కార్టూనిస్ట్  శ్రీ జయదేవ్ బాబు గారు.  నేను సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిటైరైన మరుసటి నెలలోనే నేను సిండికేషన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యే ఏర్పాట్లు చేసారు. అంతకు మునుపు కలర్ చిప్స్ లోనే 2D యానిమేషన్ శిక్షణా తరగతులు నిర్వహించి జయదేవ్ గారే ముఖ్యమైన క్లాసులు చెప్పేవారు. యానిమేటర్ ని కావాలనుకున్నాను. సిండికేషన్ డిపార్ట్మెంట్ లో ఆర్టిస్ట్ లు లేకపోవడం వలన అక్కడే కోనసాగించ వలసి వచ్చింది.

శ్రీ జయదేవ్ బాబు మరియ బాలి గార్ల తో కలసి పనిచేయడం నిజంగా నా అదృష్టం గా భావించేవాణ్ని. 
కొంత కాలం తరువాత జయదేవ్ గారు కలర్ చిప్స్ వదలి సొంతవూరు మద్రాస్ వెళ్లి పోయారు. ఆ తరువాత బాలి గారు కూడా మానేశారు. ఇద్దరు లేక పోయేసరికి నన్ను ఒంటరితనం ఆవహించింది. కొన్ని రోజులకు నేను కూడా మానేసాను.
ఆ తరువాత హైదరాబాద్ లోనే ఓ MNC Software కంపెనీలో ఆర్టిస్ట్ గా జాయినై అక్కడే Web Designing నేర్చుకున్నాను. ఆ తరువాత హిందూస్తాన్ ఏయిరో నాటికాల్స్, బాలనగర్, హైదరాబాద్లో వుద్యోగం వచ్చింది. విశాఖపట్నం లో వున్న నా తల్లి గారి అనారోగ్య పరిస్థుతుల కారణంగా HAL లో  ఎక్కువ కాలం పని చేయలేక పోయాను. రిజైన్ చేసి 2008 లో పర్మినెంట్ గా విశాఖపట్నం లో సొంత ఇంటికి మకాం మార్చాను.

నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి కార్తీక్ 10+2 మరియు అమ్మాయి కుస్మిత 10 th పరీక్షలు వ్రాస్తున్నారు. 
ప్రస్తుతం వెబ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ లో ఫ్రీలాన్సర్ గా ఆన్ లైన్ ద్వారా వర్క్ చేస్తున్నాను.