ఈ రోజు నా పుట్టినరోజు....
ముప్పై ఏళ్ళ క్రితం నా కాలేజీ రోజులలో కలం స్నేహం తో పరిచయమై విశాఖపట్నం లోనే నివాసం ఉంటున్న మిత్రుడు ప్రేమ స్వరూప్ ని ఫేస్ బుక్ లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
అప్పటి ప్రేమ స్వరూప్ ఫోటో
ధన్యవాదములు మిత్రమా..మనం కలసి ఇరవై ఏడు ఏల్లైనా ఈ కలం స్నేహితుణ్ణి మరిచిపోకుండా గుర్తుంచుకుని ఓప్పిగ్గా ఫేస్ బుక్ లో వెదికి పట్టుకున్నందుకు.
మా ఇద్దరి కలం స్నేహం గురించి చెప్పడానికి చాలావుంది. చదవండి... నేపధ్యం చాల ఉత్కంటగా కూడా వుంటుంది.
అది 1980వ సంవత్సరం అనుకుంటాను.
మిత్రులు ప్రేమ స్వరూప్ వివరాలు "కలం స్నేహితులు " శీర్షికన ఏ పత్రికలో వచ్చిందో గుర్తులేదు.
ల్యాండ్ లైన్స్ మరియు సెల్ ఫోన్లు వాడకం లో లేని రోజులలో పత్రికల లో వచ్చే "కలం స్నేహితులు" శీర్షికల ద్వారా ఇద్దరు అపరిచితుల మధ్య వుత్తరపత్యుత్తరాల ద్వారా స్నేహాలు కొనసాగేవి. అప్పట్లో వచ్చే ప్రతి పత్రికలోను "కలం స్నేహితులు" శీర్షికకు ఒక కాలమ్ విది గా వుండేది.
ఆ రోజులలో ప్రతి కాలేజీ స్టూడెంట్ చేతులలో క్లాసు పుస్తకాలతో పాటు వార/మాస పత్రికలు కూడా తప్పకుండా ఉండేవి. నాకు బాగా గుర్తు...కాలేజీ ఐపోయినాక బస్సులలో కొంచెం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే నా క్లాసు అమ్మాయిలు బస్సులో టైం పాసు కోసం బుక్ స్టాల్స్ నుండి ఆ వారం పత్రికలను కొనుక్కుని బస్సు ఎక్కేవారు. ప్రతి అమ్మాయి చేతిలో ఓ పత్రిక కనిపించేది.
కలం స్నేహితుల శీర్షికలో మిత్రుడు పేరు "ప్రేమ స్వరూపా" అని వుంటే అమ్మాయే ఐఉంటుందని భ్రమించి స్నేహం కోరుతూ వుత్తరం వ్రాసాను. ఉత్తరానికి బదులు వచ్చింది. ఆ వయసులో మనసు ఓ పెద్ద కోతి. ముందు వెనుక ఏమవుతుందో మనం ఎటు వెళ్తున్నామో తెలియని అయోమయపు పరిస్థితి.
కొన్ని రోజులు మా ఇద్దరి మధ్య ఓ "అమ్మాయీ -అబ్బాయీ" ల మధ్య సాగాల్సిన వుత్తరపత్యుత్తరాలే సాగాయి. మిత్రుడు ప్రేమ స్వరూప్ కూడా "తమాషా ఏమిటో చూద్దాం" అన్నట్లుగా వెంటనే తను ఓ అబ్బాయినే అన్న విషయం బయటపెట్టలేదు. ప్రేమ్ నాకు పంపే ఫొటోస్ మీద కూడా నన్ను కవ్వించేలా "స్వరూపా" అని తెలుగులో వ్రాసేవాడు. ఉదాహరణకు ఈ క్రింది ఫోటో చూడండి. అలా రాస్తే మరి నేనేమనుకోవాలి?

ఇటువంటి ఫోటోలు ప్రేమ్ నాకు చాల పంపించాడు. అయితే ప్రేమ స్వరూప్ తను అమ్మాయి ని కాదు అబ్బాయినే అన్న విషయం ఎక్కువ రోజులు దాచి ఉంచకుండా కొద్ది నెలలలోనే బయటపెట్టి నాకు చాల క్షోభకు గురిచేశాడు.
ఈ పోస్ట్ రాస్తున్నప్పటి సమయం రాత్రి ఒంటిగంటా ఇరువది ఐదు నిమిషములు.
"ఇంకా తెలవారదేమి?...ఈ చీకటి విడిపోదేమి?..." అని ఈ నిశిధిలో గొంతెత్తి గట్టిగా పాడాలని వుంది.
నిజం తెలిసాక ఓ రోజు ప్రేమ్ నేను ముఖాముఖి కలుసుకుని విశాఖపట్నం లో (ప్రాంతం గుర్తులేదు) వున్నావాళ్ళ ఇంటికి వెళ్ళాము.
ఆ తరువాత నేను 1982 లో వాయుసేన లో భర్తీ ఐపోయాను. నేను బెంగుళూరు ట్రైనింగ్ లో వున్నప్పుడు మరియు ఎయిర్ ఫోర్సు స్టేషన్ న్యూఢిల్లీ లో నివాసం వున్నప్పుడు ప్రేమ స్వరూప్ ఎన్నో ఉత్తరాలు వ్రాసాడు. ప్రతి ఉత్తరానికి ఓ ఫోటోగ్రాఫ్ జత చేయడం అతని ప్రత్యేకత. ప్రేమ్ కు అరుకు అందాలంటే చాల ఇష్ట్టం అనుకుంటాను. ఆయన తీసుకున్న చాల ఫొటోస్ లో అరుకు అందాలు వుంటాయి.

ప్రేమ స్వరూప్ ఉత్తరాలతో పాటు జత చేసి నాకు పంపిన కొన్ని ఫోటోలు మరియు వాటి వెనుక వ్రాసిన ఆయన భావాలు :
పై అన్నింటికంటే మరో గొప్ప విషయం ఒకటుంది. నేను ఎంతో ఎంతో అభిమానించే నా అభిమాన రచయిత్రి
డా. ద్వివేదుల విశాలాక్షి గారు స్వయానా ప్రేమ స్వరూప్ అత్తగారు (వాళ్ళ నాన్న గారి సోదరి).
డా. ద్వివేదుల విశాలాక్షి గారు స్వయానా ప్రేమ స్వరూప్ అత్తగారు (వాళ్ళ నాన్న గారి సోదరి).
మిత్రమా!... నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అనివుంది. నీలాంటి వారు మిత్రులు గా వున్నందుకు గర్వ పడుతున్నాను. ఇన్నేళ్ళు నీ కోసం ఎందుకు అన్వేషించకుండా వూరుకుండి పోయానా అని బాధ పడుతున్నాను.
తొందర్లోనే కలుసుకుందాము.ఈ పోస్ట్ రాస్తున్నప్పటి సమయం రాత్రి ఒంటిగంటా ఇరువది ఐదు నిమిషములు.
"ఇంకా తెలవారదేమి?...ఈ చీకటి విడిపోదేమి?..." అని ఈ నిశిధిలో గొంతెత్తి గట్టిగా పాడాలని వుంది.
ప్రేమ స్వరూప్ Facebook ప్రొఫైల్ :

3 వ్యాఖ్యలు:
its really great rk nuvvannattu ennallo vechina udayam.....aa excitement anubhuthinchalsinde.....lots of love j
Thank u dear friend....I feel it is a great .. u & me in the face book... I remember all the days... our friendship.. your expressions .. towards my attitude and my taste towards the art of photographs.. Ee roju chaala subha dinam.... endukante .. Today I have received a Phone call from you and its given me great pleasure.. Thanks a lot for the remembrance ...
"స్నేహబంధమూ..ఎంత మధురమూ..అది చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతమూ.."సోదరా..ప్రమస్వరూప్ తో మీ స్నేహబంధం ఎంత గట్టిదో ఇన్నేళ్లయినా చెదరని మీ జ్ఙాపకాలే కాక చిరిగిపొని మీ ఉత్తరాలు కూడా తెలుపుతున్నాయి..ఎప్పుడో ముడిపడిన ఈ స్నేహబంధం ముఖపుస్తకం ద్వారా ఇంకా గట్టిబడాలనీ జీవితాంతం ఇలాగే కొనసాగాలనీ కోరుకుంటూ మీ సోదరి..జ్యోతిర్మయి
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి