25 ఏళ్ళ క్రితం నాటి నా మాటలు లేని కార్టూను.

మాటలు  లేకుండా కేవలం బొమ్మలతోనే కార్టూన్లో అంతర్లీనంగా  వున్న వ్యంగ్యాని చూపించడం కార్టూనిస్ట్ కి నిజంగా ఓ సవాలు. బహుశా ఈ కారణం మూలంగానేమో మనం కేప్షన్ లెస్స్ కార్టూన్స్ ని పత్రికలలో చాల అరుదుగా చూస్తుంటాము.

నేను గీసిన కేప్షన్ లెస్స్ కార్టూన్స్ సంఖ్య తక్కువే ఐనా వాటిలో నాకు బాగా నచ్చింది రైల్వే ఆసుపత్రి మీద గీసిన ఈ దిగువ కార్టూన్. అప్పర్, మిడిల్ మరియు లోవేర్ బెర్త్ ల నేపధ్యం తో గీసిన కార్టూన్.  ఈ కార్టూన్  25 ఏళ్ళ క్రితం, 23 ఆగస్ట్ 1985 లో మయూరి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడినది. ఇప్పుడీ పత్రిక రావడం లేదు.  


మొన్న (21-03-2011) విశాఖపట్నం లో జరిగిన మండే మొజాయిక్ "కాల రేఖలు కార్టూన్లు"  సాహిత్య సమావేశములో అధ్యక్షులు శ్రీ రామతీర్థ గారు "కాప్షన్ లెస్స్ " కార్టూన్స్ కోసం ప్రస్తావిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు.
కాప్షన్ లెస్స్ కార్టూన్స్ ని సైలెంట్ కార్టూన్స్ గా కూడా వ్యవహరిస్తారు. కాప్షన్ లెస్స్ కార్టూన్స్ పేరువింటే నాకు వెంటనే గుర్తొచ్చే కార్టూనిస్ట్ డా. ఎస్. జయదేవ్ బాబు.


శ్రీ జయదేవ్ బాబు ఎంతో అర్ధవంతంగా సామాజిక స్పృహ ప్రస్పుటించేలా  కాప్షన్ లెస్స్  కార్టూన్స్ని కుప్పలు తెప్పలుగా గీసారు. వీటికోసమని జయదేవ్ గారు ఒక వెబ్ సైటును కూడా కలిగి వున్నారు. వెబ్ సైట్ చిరునామా http://www.silentcartoon.com/ఈ సైట్ని నేనే డిజైన్ చేసి కొత్తలో ఎంతో ఉత్సాహం క్రమం తప్పకుండా అప్ డేట్స్ చేస్తూవుండేవాణ్ని. సమయం చిక్కక అప్ డేట్స్ చేసి చాల రోజులయింది. మళ్లీ మొదలు పెట్టాలి.



1 వ్యాఖ్యలు:

కనకాంబరం చెప్పారు...

మీ బ్లాగ్, మీ కార్టూన్లు బాగున్నాయి ముఖ్యంగా పేషెంట్స్ ను తరలించే త్రీ టైర్ షిఫ్టింగ్ చాల బాగుంది. అభినందనలు . ఆ మధ్య శ్రీ పులిగడ్డ విశ్వ నాధరావు గారి యింట్లో , బాలి గారిని, పురాణం శ్రీనివాస శాస్త్రి గారిని, కలవటం జరిగింది. అభినందనలతో...శ్రేయోభిలాషి...నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం )

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి